ఎంకౌంటర్ పరిస్థితులను వివరించిన సజ్జనార్

గత నెల చోటుచేసుకున్న దిశ అత్యాచారం,హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసు లో నిందితులు అయిన నలుగురు ని పోలీసులు నిన్న ఎంకౌంటర్ లో అంతమొందించారు.

ఈ ఎంకౌంటర్ జరగడానికి ఏర్పడిన పరిస్థితులను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీపీ సజ్జనార్ మీడియా ముఖంగా వివరించారు.కోర్టు అనుమతి తో బుధవారం తమ కస్టడీ లోకి తీసుకున్న నిందితులను విచారించగా పలు విషయాలు వెల్లడించారని, దానిలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం అని ఘటనా స్థలానికి తీసుకువెళ్లగా అక్కడ దిశ సెల్ ఫోన్, పవర్ బ్యాంక్, వాచీ అక్కడ దాచాం ఇక్కడ దాచాం అంటూ కాసేపు ఆ ప్రాంతంలో తిప్పి ఆ తరువాత తప్పించుకోవాలని చూసి రాళ్లు,కర్రల తో పోలీసుల పై దాడి చేశారని తెలిపారు.

అంతేకాకుండా వారి వద్ద నుంచి ఆయుధాలు కూడా లాక్కొని కాల్పులు జరపడం తో పోలీసులు తప్పని పరిస్థితుల్లో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది అని తెలిపారు.కాల్పులు జరపవద్దు అని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ వారు వినిపించుకోకుండా కాల్పులు జరపడం తో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

కాల్పులు ముగిసిన అనంతరం వారు మృతి చెందినట్లు తెలిపారు.పోలీసుల నుంచి గన్స్‌ లాక్కొనే సమయానికే గన్స్‌ అన్‌లాక్‌ చేసి ఉండడం తో వారు కాల్పులకు తెగబడ్డారని దీనితో ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చింది అని సీపీ తెలిపారు.

Advertisement

ఎదురుకాల్పులు శుక్రవారం తెల్లవారు జామున 5:45 నుంచి 6:15 గంటల మధ్య జరిగాయని తెలిపారు.దిశ ఘటన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు సంచరించే సమయంలో నిందితుల్ని బయటకు తీసుకురావడం వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందనే తెల్లవారు జామున సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకొచ్చామని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

నిందితులు జరిపిన దాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌ తల కు గాయాలయ్యాయన్నారు.

వారిని కేర్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.మరోపక్క ఘటన స్థలంలో బాధితురాలి సెల్‌ఫోన్‌, పవర్‌ బ్యాంకు, చేతి గడియారం లభించాయని చెప్పారు.దిశ బతికుండగానే నిందితులు నిప్పు పెట్టారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆమె అప్పటికే మృతి చెందిందని సజ్జనార్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు