యార్లగడ్డ పార్టీ మార్పుపై సజ్జల రియాక్షన్..!

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహారించిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మార్పుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారనిపిస్తోందని తెలిపారు.

ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని సజ్జల వెల్లడించారు.బహిరంగ వేదికలపై ఇలా విషయాలు మాట్లాడకూడదని చెప్పారు.

పార్టీ కోసం పని చేసేవారికి గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.బలమైన పార్టీ కాబట్టి చాలా మంది భవిష్యత్ ను ఆశిస్తారని పేర్కొన్నారు.

సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడాలని తెలిపారు.అదేవిధంగా ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వెల్లడించారు.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు