స్టార్ హీరో బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి.బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడంపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే అభిమానులను ఎందుకు కొడతారనే ప్రశ్నకు బాలయ్య గతంలోనే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా సాయిమాధవ్ బుర్రా బాలయ్య గురించి షాకింగ్ సీక్రెట్లను బయటపెట్టారు.
సాధారణంగా హీరోలు ఎవరైనా ఫ్యాన్స్ ను కొట్టడానికే బౌన్సర్లను పెట్టుకుంటారని బాలయ్య అభిప్రాయమని అయితే బాలయ్య మాత్రం నా ఫ్యాన్స్ ను కొట్టడానికి బౌన్సర్లు ఎవరని భావిస్తారని ఆయన అన్నారు.అభిమానులను కొట్టాల్సి వస్తే నేనే కొడతానని నేను కొట్టడం వల్ల ఫ్యాన్స్ బాధ పడితే ఆ సమస్యను నేను పరిష్కరించుకుంటానని బాలయ్య కామెంట్లు చేశారని సాయిమాధవ్ బుర్రా తెలిపారు.
ఫ్యాన్స్ ను కొట్టే విషయంలో బాలయ్య చెప్పిన సమాధానం ఒక విధంగా కరెక్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేస్తే కొట్టడంలో తప్పు లేదని బాలయ్య చెప్పారని సాయిమాధవ్ బుర్రా తెలిపారు.బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి మూవీలో నటిస్తుండగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించారు.త్వరలో బాలయ్య ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.శృతి హాసన్ ను బాలయ్య రాక్షసి అని పిలుస్తుండగా బాలయ్య, శృతి కాంబో సీన్లు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.110 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది.స్టార్ హీరో బాలయ్య వీరసింహారెడ్డి మూవీతో అఖండను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.