హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.ఓయూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
కోట్లాదిమంది విశ్వాసాన్ని అవహేళన చేసేలా కామెంట్స్ చేయడంపై అయ్యప్ప భక్తులతో పాటు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ క్రమంలో మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న బైరి నరేశ్ కొండగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత పరారైయ్యాడు.
దీంతో నరేశ్ ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తో పాటు సిద్ధిపేటలో గాలిస్తున్నారు.
ఇప్పటికే నరేశ్ ను అరెస్ట్ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.అదేవిధంగా నరేశ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు.







