సౌత్ ఇండియా భాషలన్నింటిలో సాయిపల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.డాక్టర్ చదివి యాక్టర్ అయిన సాయిపల్లవి మలయాళ ప్రేమమ్ సినిమాకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ప్రేమమ్ సినిమానే ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
ప్రేమమ్ సినిమాలోని మలార్ పాత్రకు సాయిపల్లవి తన నటనతో ప్రాణం పోశారు.ఆ పాత్రను అద్భుతంగా పోషించి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు.
అయితే ఆ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ మాత్రం సాయిపల్లవి కాదట.స్టార్ హీరోయిన్ అసిన్ ను ఊహించుకుని దర్శకుడు ప్రేమమ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా కొన్ని కారణాల వల్ల అసిన్ ను సంప్రదించడం సాధ్యం కాకపోవడంతో ఆమెకు బదులుగా సాయిపల్లవి ఈ సినిమాలో నటించారు.
ప్రేమమ్ సినిమాలో హీరో పాత్రలో నటించిన నవీన్ పౌలి సైతం ఈ సినిమాలో అసిన్ నటించాలని భావించారట.
అయితే ఊహించని విధంగా సాయిపల్లవి ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమా సక్సెస్ సాధించడం జరిగింది.

ఒక విధంగా అసిన్ సాయిపల్లవికి ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణమయ్యారని చెప్పవచ్చు.మలార్ పాత్ర ద్వారా వచ్చిన అవకాశాన్ని సాయిపల్లవి పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని తనలోని గొప్పనటిని ఆమె ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఆ సినిమా సక్సెస్ లో కూడా సాయిపల్లవి కీలక పాత్ర పోషించారు.

ఆ తరువాత తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సాయిపల్లవి 50 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించారు.సాయిపల్లవి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా నటిగా సాయిపల్లవి మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.సాయిపల్లవి క్రేజ్ మీదే సినిమాల బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.
థియేటర్లు ఓపెన్ అయితే సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.