నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా... సాయి పల్లవి పోస్ట్ వైరల్!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో చివరగా నటించిన చిత్రం విరాటపర్వం ( Virata Parvam ).

డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఏడాది పూర్తి కావడంతో సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు.

Sai Pallavi Emotional Post Regards Virata Parvam Completed One Year,sai Pallavi,

ఈ సినిమాలో సాయి పల్లవి( Sai Pallavi ) నటనకు అందరూ ఫిదా అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.అయితే ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ విమర్శకుల నుంచి ప్రశంసలు మాత్రం అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల ఏడాది కావడంతో సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ షేర్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విరాటపర్వం సినిమా తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అని చెప్పుకొచ్చారు.

Sai Pallavi Emotional Post Regards Virata Parvam Completed One Year,sai Pallavi,
Advertisement
Sai Pallavi Emotional Post Regards Virata Parvam Completed One Year,sai Pallavi,

ఈరోజు వచ్చిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.విరాట పర్వం ఎప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటుందని ఈమె ఇందులో వెన్నెల ( Vennela ) పాత్రకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ప్రస్తుతం సాయి పల్లవి కమల్ హాసన్( Kamal Hassan ) నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు