జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై డిప్యూటీ సీఎం కొట్టు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లుందని మీ వాళ్లే అనుకుంటున్నారన్న ఆయన కాపులను కించపరిచే విధంగా మాట్లాడటం పవన్ తింగరితనమని తెలిపారు.
కాపుల ఓట్ల కోసం పవన్ ను చంద్రబాబు వాడుకుంటున్నారని చెప్పారు.కాపులు తమ వెనుక రారనే సీఎం అవుతానని పవన్ అంటున్నారన్నారు.చంద్రబాబు చెప్పడం వలనే పవన్ మాట మార్చారని తెలిపారు.175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానన్నప్పుడే ప్రజలు నమ్ముతారని వెల్లడించారు.







