మెగా స్టార్ ఇంటి కాంపౌండ్ లో మరోసారి పెళ్లి బాజాలు మొగడానికి రంగం సిద్ధమవుతోంది.ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.నిహారిక – చైతన్య ల వివాహానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు కూడా అనేక వార్తలు వచ్చాయి.2021 ఫిబ్రవరి నెలలో వీరి పెళ్లి ఉంటుందని టాలీవుడ్ టాక్.అయితే తాజాగా మెగా కాంపౌండ్ ఇంట్లో మరో పెళ్లి కి కూడా రంగం సిద్ధం అవుతుందని గట్టిగా వినబడుతుంది.మెగా స్టార్ ఫ్యామిలీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సాయి ధరమ్ తేజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి సాయి ధర్మ తేజ కు 33 సంవత్సరాలు.
ఇకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ లో హీరోలుగా ఉన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ సరైన సమయంలో పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
వారిద్దరు కూడా 30 సంవత్సరాల లోపే వివాహ కార్యక్రమం చేసేసుకున్నారు.ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ టైం వచ్చింది.
ఇక ఇందుకు సంబంధించి సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ ఆయనకు ఓ సంబంధాన్ని చూసి ఫిక్స్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.అంతే కాదు ఆ సంబంధానికి హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
కాకపోతే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తో మాట్లాడాక ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ముహూర్తాలు లేనందున.వచ్చే సంవత్సరం వేసవి కాలంలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.అయితే సాయి ధరమ్ తేజ్ చేసుకోబోయే అమ్మాయి గురించి ఇంకా ఎలాంటి విషయాలు మాత్రం బయటికి రావట్లేదు.
చూడాలి మరి ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ ఏవిధంగా స్పందిస్తాడో.