విరూపాక్ష సినిమాకు అది అందని ద్రాక్షేనా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించిన విరూపాక్ష చిత్రం( Virupaksha Movie ) గత నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.మొదటి వారం రోజుల్లోనే సినిమా దాదాపుగా 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని నమోదు చేయడం జరిగింది.

అదే ఊపు తో సినిమా దూసుకు పోతే రూ.100కోట్ల కలెక్షన్స్ నమోదు అయ్యేవి.కానీ అక్కడ జోరు తగ్గింది.

దాంతో పాటు హిందీ లో విరూపాక్ష సినిమా ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.ఐదో తారీఖున భారీ ఎత్తున సినిమా విడుదల కార్యక్రమం ఉత్తర భారతంలో మరియు తమిళనాడులో జరిగింది.

పుష్ప మరియు కార్తికేయ 2 సినిమా లు ఉత్తర భారతం లో భారీగా విజయాలను సొంతం చేసుకోవడంతో కచ్చితంగా ఈ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే సక్సెస్ దక్కించుకుందో అలాగే ఉత్తర భారతం లో కూడా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ నమ్మకంగా చెప్పాడు.కానీ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయింది.హిందీ మరియు తమిళనాడు లో వచ్చిన కలెక్షన్స్ తో కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్ లో విరూపాక్ష చేరేది కష్టం అంటూ బాలీవుడ్ వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పుడు విరూపాక్ష చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఇప్పటికే ఈ సినిమా యొక్క కలెక్షన్స్ డ్రాప్ అవడం తో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్స్ లో ఈ సినిమా ను వేయగల సత్తా ఉంది కానీ ఉత్తర భారతంలో మాత్రం అంత సీన్ లేక సినిమాను నార్మల్ గా విడుదల చేశారు.

Advertisement

అక్కడ కాస్త ఆకట్టుకోలేక పోవడంతో కలెక్షన్స్ విషయంలో నిరాశ మిగిలింది వచ్చే వారం హిందీలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు కనుక ఆ సమయంలో అయినా ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందేమో చూడండి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు