మహేంద్రసింగ్ ధోని కి సచిన్ టెండూల్కర్ తండ్రట.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ లో టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేశారు.అవాక్కయ్యారా.

?! ఇంకో విశేషం ఏంటంటే టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తన తండ్రి పేరుని సచిన్ టెండూల్కర్ గా పేర్కొన్నారు.అయితే ఈ టీచర్ పోస్ట్ పరీక్షలలో మొత్తం 15 మంది పాస్ కాగా వారిలో ధోని కూడా ఉన్నారు.

దీంతో ఇంటర్వ్యూ కోసం అధికారులు 15 దరఖాస్తుదారులను పిలిపించారు కానీ ధోని మాత్రం హాజరు కాలేదు.ఐతే దరఖాస్తు ప్రకారం, ఎంఎస్ ధోని రాయదుర్గ్ లోని సిఎస్విటియు విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారని అధికారులు గుర్తించారు.

అనంతరం వారు దరఖాస్తులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసారు.ఫోన్ స్విచాఫ్ రావడంతో ఈ అప్లికేషన్ ఫేక్ అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.ఎవరో ఆకతాయి అధికారులను ఫూల్స్ చేయాలని ఈ విధంగా నకిలీ దరఖాస్తు పెట్టి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ఈ నకిలీ వ్యక్తి కారణంగా అర్హత కలిగిన ఒక దరఖాస్తుదారుడు పోస్ట్ కోల్పోవాల్సి వచ్చిందని అందుకే ఇతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం ఆ దరఖాస్తు వైరల్ అవుతోంది.ఎంఎస్ ధోని సన్నాఫ్ సచిన్ టెండూల్కర్ అని ఉన్న దరఖాస్తులను చూసి క్రికెట్ అభిమానులు అవాక్కవుతున్నారు.తండ్రి పేరు స్థానంలో సచిన్ టెండూల్కర్ నేమ్ యూస్ చేయడం ఏంటని ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.మరోపక్క అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దరఖాస్తుల పేర్లు కూడా చెక్ చేయకుండానే ఫైనల్ ఇంటర్వ్యూ కి ఎలా సెలక్ట్ చేస్తారని చాలా మంది నెటిజన్లు అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు.ఏదిఏమైనా మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో దరఖాస్తు చేయబడిన అప్లికేషన్ ఫేక్ అని తేలింది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు