రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ

నల్లగొండ జిల్లా:రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ.

10 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమా చేస్తూ వచ్చారు.ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ( Congress Party )సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.

Rythu Bandhu Loan Is Deposited In The Farmer's Account , Rythu Bandhu ,Congress

ఇక నవంబర్‌ నెలలో రావాల్సిన రెండో విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి.ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్‌ పడింది.

మూడు వారాల క్రితమే రైతు బంధు డబ్బుల విడుదలపై సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.అయితే ప్రభుత్వం తొలుత 10 గంటల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది.

Advertisement

ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమ చేసింది.ఇక ఎకరం ఆపై భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమకాలేవు.

అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.గురువారం ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయని అధికారులు తెలిపారు.

ఒకటి లేదా రెండు రోజుల్లో మిగతా అందరి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు తెలిపారు.దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లైంది.

రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకింత రైతులు ఆందోళన చెందారు.అయితే తాజాగా ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలపడం రైతుల కళ్లలో సంతోషాన్ని నింపింది.

సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటన ఎలా ఉండబోతుంది...
Advertisement

Latest Nalgonda News