వామ్మో.. వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ అంత పెరిగిందా..?

తొలి సినిమాతోనే ప్రయోగాత్మక కథలో నటించి ప్రేక్షకుల దృష్టిలో నటుడిగా మంచి మార్కులు సంపాదించారు వైష్ణవ్ తేజ్.

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్ కథలో నటించిన వైష్ణవ్ ఉప్పెన మూవీలో ఊహించని స్థాయిలో విజయం సాధించారు.

ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కాగా ఉప్పెన చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అయితే ఉప్పెన సక్సెస్ తో వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.

దర్శకనిర్మాతలు సైతం వైష్ణవ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.వైష్ణవ్ అడగకపోయినా అతనికి పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలే భారీ మొత్తం ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తొలి సినిమాకు వైష్ణవ్ రెమ్యునరేషన్ పెద్దగా డిమాండ్ చేయలేదని ఆ సినిమాకు కోటి రూపాయల లోపే రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.అయితే భవిష్యత్తులో అతనితో సినిమాలు తీయాలని భావిస్తున్న నిర్మాతలు మాత్రం 6 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

ఉప్పెన మూవీ వైష్ణవ్ తేజ్ కు ఉప్పెనంత క్రేజ్ ను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.అయితే వైష్ణవ్ తరువాత సినిమాల ఫలితాలను బట్టే అతని మార్కెట్ గురించి ఒక అంచనాకు రావచ్చు.

ఇప్పటివరకు ఉప్పెన సినిమాకు 36 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది.మిడిల్ రేంజ్ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు కూడా వైష్ణవ్ తో సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా మరికొన్ని నెలల్లో ఈ సినిమా విడుదల కానుంది.త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించవచ్చని తెలుస్తోంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు