అఫిషియల్ : 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వాయిదా..!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమాను మరింత ప్రోమోట్ చేస్తూ రాజమౌళి అంచనాలను మరింత పెంచేస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ లో కూడా వేగం పెంచేశాడు రాజమౌళి.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్, పాటలు అన్ని కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి.

ఇక ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.డిసెంబర్ 3న ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Advertisement

అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ టాక్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.

ఈ సినిమా నుండి డిసెంబర్ 3న ట్రైలర్ రాబోతుందని రాజమౌళి ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఈ ట్రైలర్ అనుకున్న డేట్ కు రావడం లేదని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కొన్ని కారణాల వల్ల ఈ ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారని దీనిపై అధికార ప్రకటన మరియు కొత్త డేట్ కూడా ఇవ్వబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది.అయితే ఈ వార్త నిజమే అని తెలుస్తుంది.ఇక తాజాగా రాజమౌళి టీమ్ ఈ ట్రైలర్ ను కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని.

త్వరలోనే కొత్త డేట్ ను ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తుండగా.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు