తెలుగు ఇండస్ట్రీకి అతి పెద్ద సీజన్ అంటే అది సంక్రాంతి సీజనే..
ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది.పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా వరుస సినిమాలు ఈ మూడు రోజులు విడుదల అవుతూనే ఉంటాయి.
అయితే ఇటీవల పెద్ద పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చి ఒకేసారి సినిమాలు విడుదల కాకుండా చేసుకుంటున్నాయి.

ఇలా ఒకేసారి సినిమాల క్లాష్ లు కాకుండా వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చారు.ఈ క్రమంలోనే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలను తప్పించారు.కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా మంచి సినిమాలు థియేటర్స్ కి రావడం లేదు.
ఇక ఇప్పుడు వరుస సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.అయితే కరోనా మొత్తం పూర్తిగా తగ్గిపోయింది అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ కలవరం పెడుతుంది.
ఇండియాలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తుంది.
అందుకే సంక్రాంతికి విడుదల కాబోతున్న పాన్ ఇండియా సినిమాలపై దీని ప్రభావం పడనుంది.ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఉన్నాయి.
వీటిపై ఒమిక్రాన్ ప్రభావం బాగా పడనుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 నుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించింది.
అంతేకాదు థియేటర్లు మొత్తం అక్యుపెన్సీలో 50 శాతం మాత్రమే, గరిష్టంగా రోజుకు మూడు షోలను మాత్రమే ప్రదర్శించాలని ఆదేశించింది.ఈ నిబంధనలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ లను ప్రభావితం చేయవచ్చు.
ఈ సినిమా టీమ్ లు ఇప్పటికే బాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్ చేసారు.

క్రిస్మస్, న్యూ ఇయర్, ఇతర ఈవెంట్స్ సందర్భంగా ఈ ఆంక్షలు వరుసగా ఉన్నాయి.ఇది కూడా ఈ సినిమాలకు మైనస్ గా మారనుంది.ఇప్పుడు ఇంకా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలకు టెన్షన్ గా మారింది.
మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.