అమెరికాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న "RRR" మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి..!!

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "RRR" భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయి పెంచడం తెలిసిందే.

ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరుతో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెరిగింది.అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా విదేశీయులను ఎంతగానో ఆకట్టుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాగా ఎక్కువ సేపు స్ట్రీమింగ్ అయిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది.ఇక ఇదే సమయంలో ప్రపంచ సినిమా రంగంలో చెప్పుకోదగ్గ "గోల్డెన్ గ్లోబ్" అవార్డు ఇటీవల గెలుచుకోవడం తెలిసిందే.

ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో "నాటు నాటు" సాంగ్ కి గాను కీరవాణి అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకున్నారు.ఇదిలా ఉంటే అమెరికాలో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు ఈ సినిమాకి కీరవాణి అందుకోవడం జరిగింది.

Advertisement

విషయంలోకి వెళ్తే "లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్" బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది.

ఈ అవార్డుకు సంబంధించి "RRR" టీం ట్విట్టర్ లో అధికారిక ప్రకటన చేయడం జరిగింది.దీంతో ఇదే ఊపులో ఆస్కార్ కూడా గెలవాలని.అభిమానులు కోరుతున్నారు.

 మొత్తం మీద "RRR" ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాతో పాటు ఇండియన్ సినిమా స్థాయిని పెంచేస్తూ దూసుకుపోతోంది.

ముఖ్యంగా రాజమౌళి పేరు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున ప్రతిధ్వనిస్తోంది. ఇదే సమయంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా జక్కన్నతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ అవార్డుతో కలిపి మొత్తం మూడు అంతర్జాతీయ అవార్డులు "RRR" కి రావటం విశేషం.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు