కేజీఎఫ్2 మూవీ కలెక్షన్లను దాటేసిన ఆర్ఆర్ఆర్.. ఆ రికార్డ్ సొంతమంటూ?

Rrr Movie Crorssed Kgf2 Collections Details Here Goes Viral In Social Media , Charan, Tarak, Rrr Movie, Kgf2, Box Office, Non-theatrical, Japan, Highest Collections

2022 సంవత్సరంలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలలో కేజీఎఫ్2( KGF2 ) సినిమా ముందువరసలో ఉంటుంది.ఆర్.

 Rrr Movie Crorssed Kgf2 Collections Details Here Goes Viral In Social Media , Ch-TeluguStop.com

ఆర్.ఆర్ సినిమాను మించి కేజీఎఫ్2 మూవీ కలెక్షన్లను సాధించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్( R.R.R ) మూవీ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.విదేశాల్లో సాధించిన కలెక్షన్లతో ఈ సినిమా ఈ రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది.

కేజీఎఫ్2 సాధించిన కలెక్షన్లు 1233 కోట్ల రూపాయలు కాగా ఆర్.ఆర్.ఆర్ టోటల్ కలెక్షన్లు 1236 కోట్ల రూపాయలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జపాన్ లో డబ్ చేసి రిలీజ్ చేయడం, కొన్నిరోజుల ముందు ఈ సినిమాను రీరిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఈ ఘనత దక్కింది.

ఆస్కార్ అవార్డ్( Oscar Award ) రావడంతో భవిష్యత్తులో ఈ సినిమాను రీరిలీజ్ చేసినా మంచి ఫలితం దక్కే అవకాశం ఉంది.

ఆర్.ఆర్.ఆర్ సినిమా సాధిస్తున్న రికార్డులు అసాధారణమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు సైతం రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి.ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

చరణ్, తారక్( Charan, Tarak ) ఇమేజ్ ఈ సినిమాతో ఏకంగా పది రెట్లు పెరిగింది.

ఈ సినిమా రిజల్ట్ విషయంలో తారక్, చరణ్ తెగ సంతోషిస్తున్నారు.చరణ్, తారక్ తమ తర్వాత సినిమాలు మరింత స్పెషల్ గా ఉండాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.చరణ్, తారక్ మరిన్ని ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చరణ్, తారక్ లకు ఈ సినిమా ఊహించని స్థాయిలో అభిమానులను పెంచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Video : Rrr Movie Crorssed Kgf2 Collections Details Here Goes Viral In Social Media #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube