మరో ఘనత సాధించిన ఆర్సిబి.. మోస్ట్ పాపులర్ క్రికెట్ క్లబ్ గా అవతారం..!

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టే ఐపిఎల్ ను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు.

మరి అటువంటి ఐపిఎల్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే టీమ్ లు మూడు.ఒకటి ముంబై ఇండియన్స్, రెండు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, మూడు చెన్నై సూపర్ కింగ్స్.

ఇందులో ఇప్పటి దాకా ఒక్క టైటిల్ ను కూడా ఆర్బీబీ గెలవలేదు.విజయం సాధించలేకపోయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) క్రేజ్ మాత్రం అసాధారణంగా ఉంది.

గత సంవత్సరంలో అత్యధికంగా ప్రజాదరణ పొందిన క్రికెట్ క్లబ్‌గా ఆర్‌సీబీ రికార్డు నెలకొల్పింది.ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2021 చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్ల కంటే కూడా మోస్ట్ పాపులర్ టీమ్‌గా ఆర్బీబీ నిలిచి రికార్డు నెలకొల్పింది.

Advertisement

ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆర్బీబీ తమ ఫ్యాన్స్ తో మమేకం అయ్యింది.అందుకే అత్యధిక ఇంటరాక్షన్ జరిగిన క్రికెట్‌ క్లబ్‌గా ఆర్బీబీ గుర్తింపు సాధించడం విశేషం.

గత సంవత్సరంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువగా తమ ఫ్యాన్స్ తో అటాచ్ అయ్యింది.స్పోర్ట్స్ క్లబ్స్‌ జాబితాలో ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ టాప్‌లో ఉంది.

ఎఫ్‌సీ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, చెల్సీ ఎఫ్‌సీ, పారిస్ సెయింట్ జర్మన్ టాప్-5లో ఉండటం విశేషం.అయితే ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 821 మిలియన్స్ ఇంటరాక్షన్స్‌తో 6వ స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది.చెన్నై సూపర్ కింగ్స్ 719 మిలియన్ల ఇంటరాక్షన్స్‌తో 9వ స్థానంలో ఉంది.

విరాట్ కోహ్లీ కారణంగానే ఆర్సీబీ ఇంత క్రేజ్ సాధించిందని తెలుస్తోంది.ఆర్బీఐ వరుసగా ఓటమి పాలైనా కూడా ఇంత క్రేజ్ సాధించడం గొప్ప విషయం.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

​.

Advertisement

తాజా వార్తలు