హైదరాబాద్ బిర్యానిలో కుళ్ళిపోయిన మాంసం .. జాగ్రత్త

మొన్నామధ్య హైదరాబాద్ లోని ఫేమస్ బిర్యాని సెంటర్ షాగౌజ్ లో మటన్ కి బదులు కుక్క మాంసం వాడుతున్నారని వదంతులు వచ్చాయి గుర్తుందా? అది రూమర్ అని తేలడం, ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టిన ఛానెళ్ళపై షాగౌజ్ ఓనర్ కేసు పెట్టడం కూడా జరిగిపోయింది.

ఈసారి మిర్జల్ గూడ్ లోని "గ్రీన్ బావర్చి" (x roads బావర్చికి దీనికి సంబంధం లేదు) కుళ్ళిపోయిన మాంసం బిర్యానిలో వాడుతున్నారని ప్రచారం మొదలవడంతో ఈసారి కూడా గాలివార్తలే పుట్టాయి అని అనుకున్నారు జనాలు.

కాని ఈసారి వచ్చింది రూమర్ కాదు.రియల్ న్యూస్.

GHMC అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేయడంతో ఆ రెస్టారెంట్ బండారం బయటపడింది.దాదాపుగా 10-15 రోజుల ముందే కోసిన మాంసాన్ని కూడా ఫ్రెష్ బిర్యానిలో వాడుతున్నారట అక్కడ.

అంటే, ఓరోజు మాంసం మిగిలిపోతే దాన్ని పడేయట్లేదు అన్నమాట.పోని మాంసాన్ని ఉంచిన ప్రదేశాన్ని అయినా శుభ్రంగా ఉంచారా అంటే, అదీ లేదంట.

Advertisement

అధికారులు తనిఖీ చేస్తుండగా ఆ ప్రదేశాన్ని చూసి వాంతులు చేసుకున్నంత పని చేసారట.అసలే కుళ్ళిన మాంసపు కంపు, పైగా చెత్తగా ఉన్న ప్రదేశం .ఇలాంటి మాంసాన్ని బిర్యానిలోకి వాడి తినమంటున్నారు.GHMC అధికారులు ప్రస్తుతానికైతే ఆ రెస్ట్‌రెంట్ కి రూ.10,000 జరిమానా విధించారు.జరిమానాతో వదిలిపెట్టేస్తున్నారా లేక ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటారా తేలాలి.

ఇక, ఇదంతా చదివి బిర్యాని తినడానికి భయపడేరు.GHMC రూల్స్ పాటిస్తూ, మంచి బిర్యాని అందిస్తున్న రెస్టారెంట్‌లు చాలా అంటే చాలా ఉన్నాయి హైదరాబాదులో.

కాబట్టి కంగారొద్దు.కాని తినేటప్పుడు రుచి తేడాగా అనిపిస్తే ప్రశ్నించడానికి మొహమాటపడొద్దు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు