కుప్పతొట్టి రోజా – మెగా ఫ్యాన్స్ కొత్త ట్రెండ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి రోజా మెగా ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యలకు విపరీతమైన సెగ తగులుతుంది.అసలు రోజా వంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడేందుకు అర్హత లేదని పలువురు ఆమెపై విరుచుకుపడ్డారు.

 Roja Recieves Ugly Trend From Mega Fans , Roja, Chirenjeevi, Kuppathotti Roja, M-TeluguStop.com

రోజా చరిత్ర తమకు తెలుసని ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని వార్నింగ్ లు ఇవ్వడం మొదలుపెట్టేశారు.

నిన్న బాగా వైరల్ అయిన ఒక వీడియోలో రోజా మెగా ఫ్యామిలీ పైన తీవ్ర విమర్శలు చేశారు.

అసలు తాను ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి ఆమెకి సిగ్గుగా ఉందని రోజా అనడం గమనార్హం.మెగా ఫ్యామిలీ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆమె అంటూ పవన్ కళ్యాణ్, చిరంజీవి పైన దుర్భాషలాడారు.

అసలు చిరంజీవి రాజకీయాలలో లేడు పైగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రోజాపై నేరుగా విమర్శలు చేసిన దాఖలాలు కూడా లేవు.

అటువంటిది రోజా సమయం సందర్భం లేకుండా ఒక్కసారిగా మెగా ఫ్యామిలీని పిక్చర్ లోకి లాగి వారిపై విమర్శలు చేసిన తీరు ఎంతోమందికి ఆగ్రహం తెప్పించింది.

ఇక మెగా ఫ్యాన్స్ అందరూ ఆమెపై ప్రతి విమర్శలు చేశారు.రోజా వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ తాను ఎక్కువ మాట్లాడదలచుకోలేదని రోజా నోరు ఒక కుప్పతొట్టి తో సమానమని… కెలికితే మనకే కంపు అని ఒక చిన్న వీడియోలో సమాధానం ఇచ్చారు.

దీంతో కుప్ప తొట్టి రోజా అని ట్విట్టర్ లో విపరీతంగా జనసేన అభిమానులు ఇతర మెగా అభిమానులు ట్రెండ్ చేశారు.ఇప్పటికీ చిరంజీవి తన సొంత సంపాదనతో సినీ కార్మికులకు ఎంతో చేస్తున్నారు.బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడారు.ఇవి ఏవి రోజాకి తెలియకుండా లేవు.ఏదో పార్టీ మైలేజీ కోసం పార్టీ వారు ఎవరో చెప్పారని ఇలా బహిరంగంగా మెగా ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకే బెడిసి కొట్టాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube