మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రోజా చాలా మంది ప్రముఖులను కలుస్తున్న సంగతి తెలిసిందే.మొన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన రోజా తాజాగా వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు.
ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్టీ కోసం రోజా పనితనాన్ని విజయమ్మ అభినందించడం జరిగింది.
పార్టీ నాయకుడు మరియు పార్టీకి మంచి పేరు తీసుకు రావడానికి రోజా ఎంతో నమ్మకంతో నిబద్ధతతో పని చేస్తుందని విజయమ్మ తెలిపారు.
ప్రతి నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే వైయస్సార్ కూడా ఇదే చెబుతుంటారు అని.విజయమ్మ స్పష్టం చేశారు.అంతే కాదు రోజా అంటే వైఎస్ కుటుంబానికి ప్రత్యేకమైన అభిమానం ముఖ్యంగా వైఎస్ జగన్ కి ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో రోజా మరింత ఉన్నత శిఖరాలను చేరాలని విజయమ్మ ఆశీర్వదించారు.ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ మరోపక్క ప్రముఖులతో భేటీ అవుతున్నారు.దీనిలో భాగంగా తాజాగా విజయమ్మతో భేటీ కావడం జరిగింది.







