అప్పుడు శ్రీనువైట్ల ఇప్పుడు కొరటాల.. ఒకే తరహా కథలతో ఫెయిల్ అవుతున్నారా?

గత కొన్నేళ్లలో సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారడంతో పాటు హిట్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే ప్రేక్షకులను ఆదరించడం మొదలైంది.ఒకప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు వరుసగా విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Common Factor Between Srinuvaitla And Koratala Shiva Details Here, Chiranjeevi,-TeluguStop.com

బాద్ షా సినిమా వరకు శ్రీనువైట్ల హవా కొనసాగింది.టాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం శ్రీనువైట్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపారు.

అయితే శ్రీనువైట్ల సినిమాలు ప్రేక్షకులకు మొనాటనీ వచ్చి చివరకు ఫ్లాప్ గా నిలిచాయి.ప్రస్తుతం కొరటాల శివ పరిస్థితి కూడా ఒకే విధంగా ఉంది.మిర్చి సినిమా నుంచి ఆచార్య సినిమా వరకు కొరటాల శివ కథనంలో మార్పులు చేసినా మూల కథ ఒకే విధంగా ఉంది.కష్టాల్లో ఉన్నవాళ్ల సమస్యలను పరిష్కరించడమే హీరో బాధ్యత అనేలా ఆయన సినిమా ఉంటుందని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అవుతున్నారు.

ఒకే తరహా కథలు కొన్నేళ్ల తర్వాత ప్రేక్షకులకు కచ్చితంగా బోర్ కొడతాయి.ఏ ప్రత్యేకత లేని ఆచార్య కథను కొరటాల శివ చిరంజీవి, చరణ్ లతో ఎందుకు తెరకెక్కించాలని అనుకున్నారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.

కథల విషయంలో ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి ఇలాంటి మూస ఫార్ములా కథకు ఎందుకు ఓకే చెప్పారనే ప్రశ్నకు సైతం జవాబు లభించడం లేదు.

Telugu Acharya, Charan, Chiranjeevi, Koratala Shiva, Mirchi, Tollywood-Movie

ఈ సినిమా ఫలితంతో కొరటాల శివ మేలుకోవాలని లేకపోతే భవిష్యత్తు సినిమాలపై కూడా ఈ సినిమా ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఆచార్య సినిమా ఫలితంతో గుండెదడ మొదలైంది.ఆచార్య సినిమాకు నష్టాలు తప్పవని తేలిపోయింది.

అయితే ఆ నష్టాలు ఏ మేరకు ఉంటాయో చూడాల్సి ఉంది.కొరటాలకు ఫ్లాప్ రావడం ఆయన ఫ్యాన్స్ ను బాధపెడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube