Dharmendra : 87 సంవత్సరాల వయస్సులో లిప్ లాక్ సీన్.. ఈ నటుడి కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర( Dharmendra ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దాదాపు ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్‌ ( Bollywood )లో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్నారు ధర్మేంద్ర.

ఇప్పటివరకు దాదాపు 300కు పైగా చిత్రాలు చేశారు.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తున్నారు ధర్మేంద్ర.

ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని ( Rakhi aur Ranis Prem Kahani )సినిమాలో నటించాడు.

కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదల అయిన విషయం తెలిసిందే.

Advertisement

ఇందులో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ( Actress Shabana Azmi ) ఇద్దరు లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించారు.అయితే మూవీలో ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు.87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు.కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది అంటూ సెటైర్స్ వేస్తారు.

ఇంకొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాలో సన్నివేశాలపై మండిపడుతున్నారు.సినిమా అస్సలు బాగోలేదంటూ విమర్శించారు.

తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు.ఆయన మాట్లాడుతూ.

నేను, షబానా కిస్‌ సీన్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసినట్లున్నారు.సన్నివేశాలను చూసి ప్రేక్షకులు చప్పట్లు కూడా కొట్టారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

అస్సలు ప్రేక్షకులు మా నుంచి ఇది అస్సలు ఊహించి ఉండరు.అందుకే దీనికి ఇంతలా రెస్పాన్స్‌ వస్తోంది.నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను.

Advertisement

అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ మాకు ముందే చెప్పాడు.

అప్పుడు నేనేమీ అంత సర్‌ప్రైజ్‌ అవలేదు.ఈ సినిమాకు అది అవసరం అనిపించింది.

అందుకే నేను చేస్తానని చెప్పాను.అయినా రొమాన్స్‌కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్‌ మాత్రమే సూచిస్తాయి.ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు.

ఈ సీన్‌లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర.

తాజా వార్తలు