శవాన్ని బతికిస్తామని రెండు రోజుల పాటు పూజలు.. చివరికి..?? 

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నాగాని కొంతమంది మాత్రం మూఢనమ్మకాలనే విశ్వసిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.

వాళ్ళు నమ్మే మూఢనమ్మకాలు చూస్తుంటే ఒక్కోసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది.

ఎక్కడన్నా గాని చనిపోయిన మనిషి తిరిగి బతుకుతాడా చెప్పండి.ఏ మనిషికి అయిన పుట్టుక ఎలాగో ఏనాటికయినా మరణం కూడా అలాగే సంభవిస్తుంది ఎందుకంటే అది సృష్టి దర్మం కాబట్టి.

కానీ కొంతమంది మాత్రం మూఢ నమ్మకాల మత్తులో పడి తమకు తోచిన రీతిలో ప్రవర్తిస్తారు.అమావాస్య రోజున పూజలు చేయడం, చేతబడి చేయడం, మనుషులను బలి ఇవ్వడం లాంటి సంఘటనల గురించి మనం వినే ఉంటాము.

అయితే తాజాగా ఒక చనిపోయిన మృతదేహానికి పూజలు చేస్తే తిరిగి బతుకుతుందంటూ రెండు రోజుల పాటు ఆ శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని పూజలు చేయడం లాంటి ఘటన ఇప్పుడు తమిళనాడులో చోటు చేసుకుంది.అసలు వివరాల్లోకి వెళితే.

Advertisement

ఈ వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో జరిగింది.మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌ కు చెందిన 75 సంవత్సరాల మేరీ అనే మహిళకు గత వారం ఆరోగ్యం బాగోలేక తిరుచ్చి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

కానీ ఆసుపత్రికి వెళ్లాక ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.కాగా మేరీకి జయంతి (43), జెసిందా (40) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

తల్లి కూడా వీరితో పాటే కలిసి ఉంటుంది.అయితే చనిపోయిన అమ్మ శవంను దహనం చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు మేరీ కూతుళ్లు.

వాళ్ళది మూర్కత్వమో లేక మూఢనమ్మకమో తెలియదు కాని రెండు రోజులపాటు శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని ఏవేవో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.వీరి విచిత్రమైన చేష్టలు గమనించిన చుట్టు పక్కల ప్రజలు వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

పోలీసులు రంగంలోకి దిగి చనిపోయిన మేరీ ఇంటి లోపలోకి వెళ్లి శవం దగ్గర జరిపే పూజ తంతును చూసి అవాక్ అయ్యారు.ఇలా శవం దగ్గర పూజలు చేయడం సరికాదని పోలీసులు ఎంత చెప్పిన వారు వినలేదు.ఈ క్రమంలోనే మేరీ ఇద్దరు కూతుళ్లు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

పైగా తమ తల్లి బతికే ఉందని, నిద్రపోతుందని మళ్ళీ నిద్ర లేచి వస్తుందని పోలీసులతో వితండ వాదం మొదలుపెట్టారు.అలాగే మేరీ మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా అక్కచెల్లెళ్ళు అడ్డుకున్నారు.

ఎట్టకేలకు ఎలాగోలా పోలీసులు మేరీ మృతదేహాన్ని ఆసుపత్రికి పంపారు.ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్న అక్కా చెల్లెళ్లకు పోలీసులు చివరకి సరైన కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

తాజా వార్తలు