జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పిన జెనీలియా భర్త.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రితేశ్ దేశ్‌ముఖ్ అంటే చాలామంది గుర్తుపెట్టుకపోవచ్చు కానీ జెనీలియా భర్త అంటే చాలు ఇస్తే గుర్తుపట్టేస్తారు.

 Riteish Deshmukh Apologises After Journalists Claim They Were Manhandled By Acto-TeluguStop.com

కాగా రితేశ్ దేశ్‌ముఖ్ టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ భర్తతో కలిసి దిగిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తరచూ, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా ఇద్దరు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రితేశ్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే రితేశ్ తాజాగా జర్నలిస్టులకి క్షమాపణలు చెప్పారు.రితేశ్ దేశ్‌ముఖ్ తాజాగా నటించిన చిత్రం వెడ్.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ తరుణంలో ఈ నటుడి పీఆర్ టీమ్ తమతో అనుచితంగా ప్రవర్తించారని మీడియా ప్రతినిధులు తెలిపారు.ఆయన బౌన్సర్ ఒకరు నటుడిని కలవడానికి వచ్చిన తరుణంలో కోల్హాపూర్ హోటల్ బయటికి బలవంతంగా నెట్టేశారని చెప్పారు.

ఇటీవలే రితేశ్ తన భార్య జేనిలియాతో కలిసి మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్లారు.ఈ సందర్భంగా రితేశ్‌ని కలిసిన జర్నలిస్టులు పీఆర్ టీం ప్రవర్తన గురించి నటుడికి తెలియజేశారట.

దాంతో రితేశ్ మాట్లాడుతూ.మేము అవమానించామని మీరు భావిస్తే మమ్మల్ని క్షమించండి.మేము ఎటువంటి మీటింగ్‌ని ఏర్పాటు చేయలేదు.మా పెళ్లై దాదాపు 11 సంవత్సరాలు.

ఇన్ని సంవత్సరాల తర్వాత తాజాగా అమ్మవారి దర్శనం కోసం వచ్చాం.అందుకే ఇక్కడ సినిమాల గురించి మాట్లాడాలని అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు రితేశ్ దేశ్‌ముఖ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube