ఏడాది పొడుగుతా కాలాలను బట్టి భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉంటాయి.కానీ బడ్జెట్ ఎక్కువ అని చాలామంది జర్నీ చేయడానికి వెనకాడుతుంటారు.
అయితే ఈ శీతాకాలంలో చాలా తక్కువ బడ్జెట్‌లో మీరు రిషికేశ్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు వీక్షించవచ్చు.ఆ ప్లేసెస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1.రిషికేశ్

పవిత్రమైన గంగా నదికి నిలయంగా ఉన్న రిషికేశ్ చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యటకులు వేస్తుంటారు.ఈ ప్రదేశం ఢిల్లీ నుంచి కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.మీరు ప్రైవేట్ బస్సు, వోల్వో లేదా టాక్సీని తీసుకోవచ్చు.
అక్కడి నుంచి వన్-వే టిక్కెట్ల ధర 200 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు ఉంటుంది.ఇక్కడ రోజుకు కేవలం 150 రూపాయలతో రూమ్ బుక్ చేసుకోవచ్చు.
2.కసౌలి

అద్భుతమైన హిల్ స్టేషన్ దృశ్యాలను ఆస్వాదించడానికి కసౌలి ప్రదేశం చాలా ఉత్తమమైనది.కసౌలికి చేరుకునేందుకు ఢిల్లీ నుంచి కల్కాకు రైలులో వెళ్లి, అక్కడ నుంచి కసౌలికి షేర్డ్ టాక్సీని తీసుకోవచ్చు.ఢిల్లీ నుంచి రౌండ్-ట్రిప్ ప్రయాణ ఖర్చులు 1500 రూపాయలు లేదా అంతకంటే తక్కువగానే అవుతాయి.రూమ్ ధర 1000 రూపాయలకు మించదు.
3.హంపి

హంపి చారిత్రాత్మక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది.హంపికి ప్రయాణించడానికి పెద్దగా ఖర్చు అవ్వదు.ఇక్కడ రూమ్ ధరలు కూడా తక్కువగానే ఉంటాయి.
4.కన్యాకుమారి

కన్యాకుమారి ప్రాంతంలో చూడదగ్గ ప్రకృతి దృశ్యాలు ఎన్నో ఉంటాయి.ఇక్కడికి వెళ్లేందుకు కూడా ధరలు తక్కువగానే ఉంటాయి.
5.కసోల్

కసోల్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ అద్భుతమైన ప్రదేశం.ఇక్కడ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి.ఈ శీతాకాలంలో ఈ ప్రదేశాన్ని కూడా వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు.







