Duck playing dead : ఆస్కార్ అవార్డు విన్నింగ్ లెవెల్‌లో యాక్ట్ చేసిన బాతు.. వీడియో వైరల్..

సాధారణంగా ఇతర జంతువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని జీవులు చనిపోయినట్లు యాక్ట్ చేస్తుంటాయి.దీనివల్ల ఇతర జంతువులు ఈ జీవులపై ఎక్కువగా హాని చేయవు.

 Duck Who Acted At Oscar Award Winning Level Video Vira Duck, Playing Dead, Viral-TeluguStop.com

అలా చనిపోయినట్లు యాక్ట్ చేస్తూ ఇవి ప్రాణాలను కూడా దక్కించుకుంటుంటాయి.చనిపోయినట్లు యాక్ట్ చేయడంలో వీటికి మించిన నటులు మనుషుల్లో కూడా ఉండరని చెప్పచ్చు.

కాగా తాజాగా ఒక బాతు కుక్క నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు చనిపోయినట్లు యాక్ట్ చేసింది.దీనికి సంబంధించిన ఫన్నీ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @BS షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే 30 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక లాబ్రడార్ కుక్క రొప్పుతూ కనిపించడం చూడవచ్చు.

అయితే ఈ కుక్క ముందే ఒక బాతు చనిపోయినట్టు యాక్ట్ చేస్తూ కనిపించింది.దాంతో కుక్క ఆ పక్షిని ముట్టుకోలేదు.

కుక్క వేరే వైపుకు వెళ్ళిపోయింది.చనిపోయినట్లు యాక్ట్ చేస్తున్న బాతు వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.

వావ్, ఇది మాములు యాక్టింగ్ కాదు.ఇది పాలీవాగల్ రియాక్షన్ అని కొందరు అంటున్నారు.

అంటే ఈ రియాక్షన్ వల్ల జంతువులు లేదా పక్షులు భయంతో కొయ్యబారి పోతాయి.

అయితే మరి కొందరు మాత్రం బాతు ఇలాంటి రియాక్షన్ ఏమీ ప్రదర్శించలేదని అంటున్నారు.ఎందుకంటే ఈ బాతు కుక్క వెళ్లిపోగానే వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube