కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు తమకు నచ్చినట్లుగా ప్రవర్తించుకుంటూ పోతారు.అందరి ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు.
ఏదేదో మాట్లాడాలని నోటికి వచ్చింది మాట్లాడి నోరు జారుతుంటారు.ఇక మరికొంతమంది వద్దనుకుంటేనే కావాలి అన్నట్లుగా ప్రవర్తిస్తారు.
అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీకి చెందిన హీరో కానీ, దర్శకుడు కానీ తమ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకొని వేరే ఇండస్ట్రీ గురించి నెగటివ్ గా మాట్లాడుతుంటారు.కానీ ఆ ఇండస్ట్రీ పైనే కన్ను వేస్తారు.
అలా ఇప్పటికి చాలామంది సినీ ప్రముఖులు తమకు ఆ ఇండస్ట్రీ నచ్చదు అంటూనే అందులో డబ్బింగులు ద్వారా సినిమాలు విడుదల చేస్తారు.అయితే చాలావరకు తమకు ఆ ఇండస్ట్రీ నచ్చదు అని బయటకు చెప్పుకోరు.
కానీ కొన్ని కొన్ని సందర్భాలలో నోరు జారడం వల్ల లేదా అతిగా మాట్లాడడం వల్ల దొరుకుతుంటారు.ఇప్పుడు అటువంటి పరిస్థితినే డైరెక్టర్ రిషబ్ శెట్టికి ఎదురయింది.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.
ఇటీవలే కాంతారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో అంటే ఎవరైనా గుర్తుపడతారు.ఈయన హీరో గానే కాకుండా ఆ సినిమాకు డైరెక్టర్గా కూడా చేశాడు.అంతేకాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈయన తొలిసారిగా 2010లో సినీ రంగంలో అడుగు పెట్టాడు.
మొదట సైడ్ క్యారెక్టర్లు చేసిన రిషబ్ 2016లో కిరిక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించాడు.ఆ తర్వాత 2018లో హీరోగా అడుగు పెట్టాడు.
దీంతో అతనికి హీరోగా, దర్శకుడిగా బాగా కలిసి వచ్చింది.అలా పలు సినిమాలలో దర్శకత్వం వహిస్తూనే తానే హీరోగా, తానే నిర్మాతగా చేశాడు.
అయితే ఇటీవలే కాంతారా సినిమాతో పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దీంతో అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులు కూడా డైరెక్టర్ రిషబ్ గురించి మాట్లాడుకుంటున్నారు.ఆయన తీసిన సినిమా అద్భుతంగా ఉంది అని తెగ పొగిడారు.కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేశాడు.
ఇక అన్ని భాషలలో ఈ సినిమా భారీ వసూలు సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో కూడా మంచి రికార్డు సొంతం చేసుకుంది.
అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ మీడియాతో మాట్లాడగా.అందులో తను కన్నడ వ్యక్తిగా గర్వపడుతున్నాను అంటూ.హిందీ సినిమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నటించను అని.ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ కన్నడ ప్రజలే వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజి లో ఉన్నానని కామెంట్ చేశాడు.అంతేకాకుండా ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన నా కుటుంబం, నా ఫ్రెండ్స్ మారారు అంటూ.
కన్నడ సినిమాలంటేనే ఇష్టమని వ్యాఖ్యలు చేయటంతో ప్రస్తుతం అవి పెద్ద వైరల్ గా మారాయి.ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆయనపై బాగా మండిపడుతున్నారు.అలాంటప్పుడు హిందీలో ఎందుకు విడుదల చేశారు అని బాగా మండిపడుతున్నారు.పైగా బాగా ట్రోల్స్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు.