అందం ఉన్న, నటన ఉన్న కూడా కొన్ని సార్లు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ లు సినిమా అవకాశాల రేసులో వెనకబడిపోతారు.పట్టుమని పది సినిమాల్లో నటించకుండానే ఇండస్ట్రీ నుంచి అర్థాంతరంగా కెరీర్ ముగించేస్తూ ప్రేక్షకులను నిరాశ పరుస్తూ ఉంటారు.
మరి కొంత మంది హీరోయిన్స్ విషయానికి వస్తే కొన్ని మంచి సినిమాలు చేస్తారు అంతే మంచి పేరు కూడా సంపాదించుకుంటారు.ఆ సినిమాలకు మంచి అవార్డ్స్ కూడా వస్తాయి/ అయినా కూడా ఆ తర్వాత అవకాశాలు ఉండవు.
ఆలా నటించిన మొదటి సినిమాతో అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రితిక సింగ్. ఈమె మొదటి నుంచి నటి కావాలనుకోలేదు.
నిజానికి ఆమె ఒక మిక్సుడ్ మార్షల్ ఆర్టిస్ట్. 2009 ఆసియన్ ఇండోర్ గేమ్స్ లో పూర్తి చేసుకున్న రితిక ఆ తర్వాత మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది.2013 లో సూపర్ ఫైట్ లీగ్ లో పాల్గొన్న రితిక సింగ్ దర్శకురాలు సుధా కొంగర సృష్టి లో పడింది.చూడటానికి అందంగా ఉంటూ అంతకన్నా అందమైన ఆట ఆడుతున్న రితిక ను హీరోయిన్ గా మార్చేసింది సుధా.
సుధా కొంగర హిందీ మరియు తమిళ్ లో ఇక కాలంలో డైరెక్ట్ చేయడానికి బాక్సింగ్ నేపథ్యంలో ఒక కథ రాసుకుంది.ఆ కథలో మెయిన్ లీడ్ బాక్సర్ పాత్రకు రితిక అయితే చక్కగా సరిపోతుంది అని భావించిన సుధా ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది.

ఇక మాధవన్ మరియు రితిక ప్రధాన పాత్రలో తెరకెక్కగా తమిళ్ లో ఈ సినిమా పేరు ఇరుది సుత్రు అలాగే హిందీ లో ఈ సినిమా పేరు శాల ఖద్దూస్. ఈ చిత్రం అటు తమిళ్ మరియు ఇటు హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అంతే కాదు ఇలాంటి ఒక కథతో సినిమా హిట్టు కొట్టి బాక్స్ ఆఫీస్ వసూళ్లను తిరగరాసింది.ఇక వెంకటేష్ హీరోగా ఈ సినిమా గురు పేరు తో రితిక్ మెయిన్ లీడ్ గా రీమేక్ చేయగా, సుధా కొంగర నే దర్శకత్వం చేసారు.

తెలుగు లో సైతం భారీ హిట్టును తన ఖాతాలో వేసుకుంది రితిక.ఇలా చాల తక్కువ సమయంలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న కూడా ఆమెకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు.ఇక రాఘవ లారెన్స్ తో ఒక సినిమా విజయ్ సేతు పతి రెండు సినిమాల్లో నటించిన రితిక 2 ఏళ్లుగా అవకాశాలు లేవు.పరిస్థితి చూస్తూనే ఆమె కెరీర్ దాదాపుగా ముగిసినట్టే కనిపిస్తుంది.







