అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ముస్లిం యువతి అరుదైన ఘనత సాధించింది.23 ఏళ్లకే చట్టసభలో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది.ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభ 51వ హౌస్ డిస్ట్రిక్ట్‌కు జరిగిన ఎన్నికల్లో నబీలా సయ్యద్ విజయం సాధించారు.తద్వారా ఎన్నికల్లో గెలుపొందిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.
నబీలా డెమొక్రాట్ పార్టీకి చెందినవారు.డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధిగా జనరల్ అసెంబ్లీకి ఎన్నికైనందుకు ఆమె ట్విట్టర్ ద్వారా తన ఆనందం పంచుకున్నారు.
తాము రిపబ్లికన్‌ల ఆధీనంలో వున్న సబర్బన్ జిల్లాను దక్కించుకున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు.ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధర పెరగడం, ఆస్తి పన్నుల భారం, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, తుపాకీ భద్రత చట్టాలే అజెండాగా నబీలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జూన్ 2022లో నబీలా సయ్యద్.డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీలో గెలిచారు.తాజా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ నేత క్రిస్ బాస్‌పై విజయం సాధించారు.ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభలో తొలి దక్షిణాసియా వ్యక్తి అయిన సయ్యద్.
రాష్ట్ర అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలైన సభ్యురాలిగానూ రికార్డుల్లోకెక్కారు.ఇల్లినాయిస్‌లో పుట్టి పెరిగిన నబీలా సయ్యద్.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైంది.నబీలా సయ్యద్ తన ఎన్నికల మేనిఫెస్టోలో సమాన హక్కులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పన్నులు వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించారు.

రాజకీయాలతో పాటు ఇస్లామిక్ సొసైటీ ఫర్ నార్త్ వెస్ట్ సబర్బ్స్‌లోనూ మతపరమైన సంస్థలో నబీలా చురుగ్గా వుంటున్నారు.అలాగే ఇంటర్ ఫెయిత్ డైలాగ్‌ను సమర్ధించారు.ముస్లిం యువతులకు నాయకత్వం వహించడం వంటి వాటిపై లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.







