ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.ప్రధానిగా తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపింది మోదీనేనని ఆరోపించారు.మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పినా బీజేపీకి సిగ్గు రాలేదని విమర్శించారు.
మోదీ తెలంగాణలో పర్యటనకు వచ్చే ముందు రాష్ట్రానికి ఏం ఇచ్చారో, ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణపై కేంద్రానికి సవతి ప్రేమ అని ఎద్దేవా చేశారు.







