అలాంటి వారి లిస్ట్ ఎక్కువే ఉంది... రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారిలో నటుడు రిషబ్ శెట్టి ఒకరు.

ఈయన హీరోగా గత ఏడాది తన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.

ఈ సినిమా కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డులను నామినేషన్ లో ఉండడం గమనార్హం.

ఇలా కాంతర సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమా గురించి రష్మికను ప్రశ్నించడంతో ఈమె ఈ సినిమా చూడలేదంటూ చెప్పిన సమాధానం కన్నడ ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.దీంతో ఈ విషయం గురించి రష్మిక రిషబ్ శెట్టి మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతుంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ విడివిడిగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఒకరిపై మరొకరు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉన్నారు.

Rishab Shetty Indirect Comments On Rashmika Mandanna Details, Rishabh Shetty,
Advertisement
Rishab Shetty Indirect Comments On Rashmika Mandanna Details, Rishabh Shetty',

ఈ క్రమంలోనే తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి పరోక్షంగా రష్మికను ఉద్దేశిస్తూ మరోసారి కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి మాట్లాడుతూ మేము ఇండస్ట్రీకి ఎంతో మంది సెలబ్రిటీలను లాంచ్ చేసాము.చాలామంది దర్శక నిర్మాతలు మాకు అవకాశాలు కల్పించారు.

Rishab Shetty Indirect Comments On Rashmika Mandanna Details, Rishabh Shetty,

అలాంటి వారి లిస్ట్ మా దగ్గర ఎక్కువగానే ఉంది అంటూ ఈయన కామెంట్ చేశారు.అయితే ఈయన ఇండస్ట్రీకి లాంచ్ చేసిన వారిలో రష్మిక మందన్న కూడా ఒకరు.ఈమె నటించిన మొదటి చిత్రం కిరిక్ పార్టీ సినిమాకు దర్శకుడుగా రిషబ్ శెట్టి వ్యవహరించగా ఈ సినిమాతో రష్మికను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఉద్దేశించి రిషబ్ శెట్టి పరోక్షంగా రష్మిక గురించి మాట్లాడరని తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు