పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్న రిషబ్ శెట్టి.. ఈ స్టార్ హీరో నిజంగా గ్రేట్ అంటూ?

తెలుగు సిని ప్రేక్షకులకు కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి( Director Rishabh Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి.

చిన్న సినిమాగా విడుదల అయిన కాంతార సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా సినిమా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

అన్ని భాషల్లో ఈ చిత్రం 300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.ఇక డిజిటల్, శాటిలైట్ హక్కుల లెక్క వేరే.

ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రిషబ్ శెట్టి.

Advertisement

ప్రస్తుతం రిషబ్ శెట్టి పార్ట్ కాంతార 2( Kantara 2 ) లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో ఆసక్తి పెంచేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే కాగా రిషబ్ శెట్టి స్వగ్రామం కెరటి దక్షిణ కర్ణాటకలో ఉంది.తాజాగా రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి ఈ ఏడాది చారిటి ట్రస్ట్ కూడా ప్రారంభించారు.

తన ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆదివారం రోజు రిషబ్ శెట్టి కెరటిలో పాఠశాలని సందర్శించాడు.

పాఠశాలని దత్తత తీసుకోవడం పై రిషబ్ ఉపాధ్యాయులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నారు అంటూ గ్రామ పెద్దలు నాయకులు అభినందిస్తున్నారు.అంతేకాకుండా రిషబ్ శెట్టి చేస్తున్న పనిని చూసి అభిమానులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఇకపోతే అభిమానులు కాంతార 2 సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు