రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్..!

రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.

ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని డర్హామ్‌ లోని ఇండియా క్యాంప్‌ లో అడుగుపెట్టాడు.

జూన్ 18వ తేది నుంచి 23వ తేది వరకూ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా క్రికెటర్లకి 20 రోజుల బ్రేక్ ఇచ్చారు.

ఈ విరామం టైంలో యూరో కప్ మ్యాచ్‌ లను చూసేందుకు స్టేడియంకి వెళ్లిన రిషబ్ పంత్ మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా మరీ అభిమానులతో ఫొటోలు తీసుకున్నాడు.దాంతో ఈ యువ వికెట్ కీపర్ కరోనా వైరస్ బారినపడిట్లు బీసీసీఐ తెలిపింది.

లండన్‌ లోని తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న సమయంలోనే రిషబ్ పంత్‌ కి కరోనా పాజిటివ్‌ గా తేలింది.

Advertisement

దీంతో అక్కడే ఐసోలేషన్‌ లో ఉండి పంత్ కోలుకున్నాడు.ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పంత్ కు కరోనా నెగటివ్ రావడంతో డర్హామ్‌ కి వెళ్లిన పంత్ అక్కడ టీమిండియా క్యాంప్‌ తో చేరిపోయాడు.ప్రస్తుతం అక్కడ భారత జట్టు కౌంటీ ఎలెవన్‌ తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతోంది.

రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌ గా మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌ అందుకున్న విషయం తెలిసిందే.భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వ తేది వరకూ 5 టెస్టుల సిరీస్ జరగనుంది.

టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో నిరాశపరిచిన పంత్ ఈ సిరీస్‌ లో సత్తాచాటాలని అందరూ ఆశిస్తున్నారు.ప్రస్తుతం భారత జట్టు కౌంటీ ఎలెవన్‌ తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది.

ఈ మ్యాచ్ కు పంత్ దూరమయ్యాడు.భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది.ఇందులో ఫస్ట్ టెస్టు మ్యాచ్‌ లో వికెట్ కీపర్ పంత్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.2018 లోనూ గత టీమిండియా టెస్టు జట్టులో రిషబ్ పంత్ ఆడాడు.ఆ టెస్టు సిరీస్ లో భారత్ ఓటమిపాలైంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు