కాలుష్యం వెదజల్లుతున్న రైస్ మిల్లులు

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నేరేడుచర్ల పట్టణం( Neredcherla ) జాన్ పహాడ్ రోడ్డులో గల రాఘవేంద్ర, మల్లికార్జున రైస్ మిల్లుల నుండి వెలువడే దుమ్ము, ధూళి,దుర్గంధంతో స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నామనిఆరోపిస్తూ కాలనీవాసులు రైస్ మిల్లులు ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ రైస్ మిల్లుల నుండి వెలువడే దుమ్ము, ధూళి,పొగతో పాటు దుర్గంధపు వాసన ఇళ్లలోకి చేరి భరించలేకుండా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలుష్యం( Pollution )తో అనారోగ్యాల పాలవుతూ ఆర్ధికంగా కూడా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఈ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ప్రజల ఆరోగ్యానికి హానికరంగా తయారైన మిల్లులను తక్షణమే మూసేసి,ఇక్కడి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆకారపు వెంకటేశ్వర్లు,చేవూరి మాల్యాద్రి,ప్రభాకర్ రెడ్డి, గడ్డం సతీష్ రెడ్డి,తాడొజూ శ్రీనివాసులు,ప్రభాకర్ రెడ్డి, రమణమ్మ,సరిత,నందిని,గడ్డం మమత,సిపిఐ (ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్, జిల్లా కమిటీ సభ్యుడు వాస పల్లయ్య,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్,పివైఎల్ జిల్లా నాయకుడు వాస కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవడం సులభం
Advertisement

Latest Suryapet News