డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) “వ్యూహం” అనే సినిమా చేయడం జరిగింది.త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
వైసీపీ అధినేత జగన్ జీవితంలో రాజకీయంగా చోటు చేసుకున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సినిమాలో పాత్రలు కూడా వాస్తవ జీవితంలో వ్యక్తుల యొక్క పేర్లతో ఉండటంతో.“వ్యూహం” ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.పరిస్థితి ఇలా ఉంటే “వ్యూహం” సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) హైకోర్టునీ ఆశ్రయించారు.
ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ పిటీషన్ ఈనెల 26న హైకోర్టులో విచారణకు రానుంది.చంద్రబాబుని అప్రస్తుతిష్ట పాలు చేయడానికి రాంగోపాల్ వర్మ ఇష్టం వచ్చినట్లు పాత్రలు ఎంచుకుని సినిమా చిత్రీకరించారు.“వ్యూహం” సినిమాతో జగన్ కి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ పిటిషన్ లో తెలియజేయడం జరిగింది.గతంలో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ సినిమాలో నిజజీవితంలో ఉన్న పాత్రల పేర్లను వాడటమే దానిపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ పరిణామంతో రాంగోపాల్ వర్మ.రివైజింగ్ కమిటీకి పంపించి అక్కడ అనుమతులు పొందుకోవటం జరిగింది.
ఈ పరిస్థితిలో నారా లోకేష్ ఇప్పుడు ఆర్జీవి తీసిన “వ్యూహం” సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించటం సంచలనంగా మారింది.