వర్మ మార్చాడా? ఆమె మార్చుకుందా?

రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవలే తన ఎన్‌ఎన్‌ఎన్‌ చిత్రంతో స్వీటీ అనే అమ్మాయిని పరిచయం చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

ఆ సినిమా వచ్చిన తర్వాత ఆమె అసలు పేరు స్వీటీ కాదు శ్రీ రాపాక అని తేలింది.

శ్రీ అనేక ఇంటర్వ్యూల్లో తనకు స్వీటీ అంటూ వర్మ పెట్టారని చెప్పింది.శ్రీ రాపాక అయిన తన పేరును వర్మ ఎందుకు మార్చాడో తనకు తెలియదని కూడా పేర్కొంది.

ఇదే సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ కొత్త సినిమా థ్రిల్లర్‌కు సంబంధించిన ప్రకటన చేశాడు.థ్రిల్లర్‌ చిత్రంతో కొత్త ముద్దుగుమ్మ అప్సర రాణి అనే అమ్మాయిని పరిచయం చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

ఇలాంటి అందమైన అమ్మాయిని ఇప్పటి వరకు నేను చూడలేదని, ఇంత అందం ఒడిశ్శాలో ఉంది అంటే ఇప్పటికి నమ్మలేక పోతున్నాను అంటూ తెగ హడావుడి చేశాడు.అయితే ఆమె ఏమీ ఫ్రెష్‌ అమ్మాయి కాదని ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేసిందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

తెలుగులో రెండు సినిమాలు చేసినా గుర్తింపు దక్కించుకోలేక పోయిన అంకితా మహారాణా నే ఈ అప్సర రాణి అంటూ నెటిజన్స్‌ కనిపెట్టేశారు.

అంకితాను ఎందుకు అప్సరాగా మార్చారు అనేది తెలియాల్సి ఉంది.సినిమా కోసం వర్మ మార్చాడా లేదంటే ఆమె కావాలని మార్చుకుందా.లేదంటే గతంలో ఆమె నటించిన సినిమాల కోసం అంకితా అంటూ పేరు మార్చుకుందా.

ఈమె అసలు పేరే అప్సరానా అంటూ నెటిజన్స్‌ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.ఆమె ట్విట్టర్‌ హ్యాండిల్‌కు మాత్రం అప్సర అనే పేరు ఉంది.

కనుక అంకిత అనేది ఆమె పెట్టుకున్న పేరు అయ్యి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.అసలు విషయం ఏంటీ అనేది వర్మ థ్రిల్లర్‌ చిత్రం విడుదలైన తర్వాత ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు