రాజ‌మౌళి ప్రేమ‌లో ఆర్జీవీ

ఉన్న‌ట్టుండి క్రియెటివ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న పంథా మార్చేసుకున్నారు.ఎప్పుడూ సెన్సేష‌న్ స్టేట్‌మెంట్స్‌తో హ‌డ‌లెత్తించే రామూ ఈ సారి స్టాండ్ మార్చుకున్నారు.

బాహుబ‌లి 2 సినిమా విష‌యంలో దండ‌ల‌య్యా .దండ‌ల‌య్యా అంటూ రాజ‌మౌళిని తెగ పొగిడేస్తున్నారు.నిన్న‌టి వేళ ట్విట‌ర్ వేదిక‌గా భ‌ళిరా భ‌ళి సాహోరే బాహుబ‌లి పాట వీడియోని ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేసిన సంద‌ర్భంగా రామూ చేసిన రీ ట్వీట్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సాంగ్ వీడియో చూశాక రాజ‌మౌళి తాను ఉన్న ఫొటోను రీట్వీట్ చేసి, ఇందులో నా క‌న్నా రాజ‌మౌళినే అందంగా ఉన్నారంటూ కితాబిచ్చారు.

అంత‌టా ఒక‌టే మానియా ఇక బాహుబ‌లి 2 ప్ర‌మోష‌న్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది.చిత్ర‌బృంద‌మంతా మీడియాతో ముచ్చ‌టించేందుకే స‌మ‌యం కేటాయిస్తున్నారు.సెంథిల్‌, అనుష్క‌, రాజ‌మౌళి , ప్ర‌భాస్‌, రానా ఇలా ఒక్క‌రేంటి అంతా!! కూడా.! దాదాపు ఐదేళ్ల పాటు ఈ బృందం చేసిన కృషి న‌భూతో!! టెక్నిక‌ల్ అండ్ నాన్ టెక్నిక‌ల్ వింగ్స్ అన్ని కూడా ఏక‌తాటిపై న‌డిచి ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దేందుకు అహ‌ర‌హం శ్ర‌మించాయి.

ఇప్ప‌టికే విడుద‌లై పాట‌లు సైతం సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయ్‌.మొద‌టి ప‌ది రోజులు ఆరు షోలు ప్ర‌ద‌ర్శించేందుకు ఏపీ స‌ర్కార్ సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అందుకు అనుగుణంగా డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

మొత్తంగా బాహుబ‌లి మానియా దేశాన్ని కదిపి కుదిపేస్తోంది.ఇక క‌లెక్ష‌న్ల సునామీ మొద‌ల‌వ్వ‌డ‌మే త‌రువాయి.! ఈ సినిమా త‌రువాత రాజ‌మౌళి విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాయాజాలానికి కొంత కాలం దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

మ‌గ‌ధీర త‌రువాత మ‌ర్యాద రామ‌న్న అనే చిన్న సినిమా తీసి ఎలా హిట్ కొట్టారో ఈ సారి అలానే ఓ చిన్న సినిమాకు శ్రీ‌కారం దిద్ద‌నున్నారేమో! మ‌రోవైపు కొడుకు కార్తికేయ నిర్మాత‌గా మారేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.సో,.రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రం సొంత బ్యాన‌ర్‌లో ఉంటుందేమో! .

Advertisement

తాజా వార్తలు