ఇందు గలడు అందులేడని సందేహము వలదు.అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాడు.
ఏ టాపిక్ అయినా కూడా అతడు అనర్గళంగా మాట్లాడగలడు.అతనికి అద్భుతమైన జ్ఞానం ఉంది అనడంలో సందేహం లేదు.
అతి ప్రవర్తన వల్ల ఆయన యొక్క విజ్ఞానం తప్పు దోవ పడుతోంది అంటూ కొందరు విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.ఈ సమయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి వర్మ ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ట్రైలర్ విడుదల అయింది.మొదటి నుండి కూడా విమర్శిస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ మరో సారి తనదైన శైలిలో ఆ సినిమా పై కామెంట్ చేశాడు.
ట్రైలర్ చూసిన తర్వాత వర్మ స్పందిస్తూ.సినిమాలో రానా మరియు పవన్ కళ్యాణ్ ల కాంబో సన్నివేశాలపై మాట్లాడాడు.ఒక పవన్ కళ్యాణ్ అభిమాని గా చెబుతున్నాను రానా సినిమా లో పవన్ కళ్యాణ్ తో పోటీ పడడం నాకు నచ్చలేదు.వారిద్దరి మధ్య సన్నివేశాల్లో రానా హైలెట్ అవుతున్నాడు.
అది నాకు ఏమాత్రం నచ్చలేదు.ఒక పవన్ కళ్యాణ్ అభిమాని గా నేను ఆ సన్నివేశాలను వ్యతిరేకిస్తున్నాను అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వర్మ చెప్పాలనుకున్నది ఏంటి అంటే రానా పాన్ ఇండియా స్టార్.బాహుబలి తో ఆయన స్థాయి చాలా పెరిగింది.
కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం అంత సీన్ లేదు.పవన్ కళ్యాణ్ తో రానా నటించడం ఆయన స్థాయిని తగ్గించుకోవడం అవుతుంది అంటూ ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు నెటిజన్స్ గుసగుసలాడుకుంటున్నారు.వర్మ వ్యాఖ్యలను పవన్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు.భీమ్లా నాయక్ గురించి వర్మ చేస్తున్న వ్యాఖ్యలను ఆపేస్తే బాగుంటుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి వర్మ ఏం చేసినా కూడా సెన్సేషన్ అని మరోసారి నిరూపితమైంది.