మంత్రుల భూదందాల వెలికితీతపై రేవంత్ పకడ్బందీ వ్యూహం... అదేంటంటే?

ఈటెల రాజేందర్ కు కేసీఆర్ కు మధ్య రాజకీయ యుద్ధం అనేది నడుస్తూ ఉంది.

మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూమి కబ్జా చేసాడని తెలిపిన విషయం తెలిసిందే.

అయితే రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ సత్వర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.అయితే అదే సమయంలో దేవరయాంజల్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఈటెల అవకతవకలకు పాల్పడ్డాడని ప్రభుత్వం కమిటీని నియమించింది.

అయితే ఈ సమయంలో ఈ భూముల కబ్జాపై రేవంత్ స్పందించాడు.టీఆర్ఎస్ మంత్రులు తెలంగాణలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, దేవరయాంజల్ కాక రాష్ట్రంలో ఉన్న చాలా వరకు అసైన్డ్ భూములు టీఆర్ఎస్ మంత్రుల, ఎమ్మెల్యేల అధీనంలో ఉన్నాయని రేవంత్ కేసీఆర్ పై విరుచుకపడ్డాడు.

అయితే ఈ భూముల వ్యవహారంపై ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి ప్రజల్లో చర్చ లేవదీయాలన్నది రేవంత్ వ్యూహంలా కనిపిస్తోంది.ప్రజల్లో ఒక్కసారి చర్చ మొదలైతే అది పెద్ద ఎత్తున రకరకాల రూపాలను సంతరించుకొని మారితే టీఆర్ఎస్ కు పాజిటివ్ గా అయినా మారచ్చు, లేకపోతే నెగెటివ్ గా నైనా మారవచ్చు.

Advertisement

అయితే మరల రేవంత్ వేసే వ్యూహం ఫలితే ఈటెల మీద విసిరిన అస్త్రం తనకే తగిలే అవకాశం ఉంది.అందుకే ఇప్పుడు భూముల వ్యవహారం ఆద్యంతం ఆసక్తి కరంగా మారుతోంది.

ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు