కాంగ్రెస్ కు రేవంత్ షాక్ ! రాజీనామా చేస్తానంటూ...?

అంతర్గత కుమ్ములాటలు.గ్రూపు రాజకీయాలతో తన్నుకుంటూ ఉండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మహా కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తోంది.

అయితే.అయితే సీట్ల తెంపు అవ్వకపోవడంతో.ఆ పొత్తు ఇంకా అసంతృప్తిగానే ఉండిపోయింది.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే.ఇప్పుడు రేవంత్ ఫీవర్ కాంగ్రెస్ ను కలవరపెడుతోంది.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి తన వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తనతో పాటు పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపించిన ఆయన ఇలాగైతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుని పార్టీకి రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.దీంతో పునరాలోచనలో పడిన అధిష్టానం రేవంత్ వర్గానికి చెందిన ఏడుగురు అభ్యర్ధుల ఆశిస్తున్న స్ధానాలను పెండింగ్‌లో ఉంచారు.

Advertisement

అభ్యర్ధులను ఖారారు చేసినా చివరి నిమిషంలో జరిగిన పరిణామాలతో వరంగల్‌ ఈస్ట్‌, నిజామాబాద్ రూరల్‌, ఆర్మూర్ ఎల్లారెడ్డి, దేవరకొండ, ఇల్లందు, సూర్యపేట స్ధానాలను పెండింగ్‌లో ఉంచారు.కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి మరి.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు