రేవంత్ ప్రెస్ మీట్ కి టి.పీసీసీ అధ్యక్ష పదవికి లింకేంటి ?

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిస్తేజంలో ఉంది.కాంగ్రెస్ కు బలమున్న రాష్ట్రంలో కూడా బలహీనపడుతుండడం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది.

ఆంధ్ర, తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించడం ద్వారా తెలంగాణలో పార్టీకి ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది.కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆ అంచనా తారుమారైంది.తెలంగాణలో టిఆర్ఎస్ ముందు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరకొరగా సీట్లు దక్కించుకున్నా అందులో చాలామంది పార్టీ మారిపోయారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని పార్టీని పరుగులు పెట్టించే సత్తా ఉన్న నాయకుడికి అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.దీంతో ఈ రేసులో పోటీ పడే వారి సంఖ్య చాలా పెద్దగానే ఉంది.

పార్టీ సీనియర్లంతా పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు.

Advertisement

అధ్యక్ష పదవికి మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి.అయితే ఆయనకు సీనియర్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడంతో ఆయన సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయనకి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చి గుర్తించింది హై కమాండ్.

తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరుపైన, కెసిఆర్ పరిపాలనపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేవంత్.

బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని రేవంత్ విమర్శించారు.పేదలకు ఇచ్చే డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో వైఫల్యం, దళితులకు మూడు ఎకరాల భూముల్లో వైఫల్యం, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలా అన్నిటిలోనూ కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అని రేవంత్ విమర్శించారు.

రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉంటే కెసిఆర్, కేటీఆర్, రామేశ్వరరావు, మెగా కృష్ణా రెడ్డి తదితరులు తెలంగాణలో ధనవంతులు అయ్యారు అంటూ రేవంత్ విమర్శించారు.అయితే ఈ విమర్శలు చేయడానికి ఢిల్లీని ఎంచుకోవడం వెనుక రేవంత్ రాజకీయం వేరేగా ఉన్నట్టు అర్ధమవుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కోసం పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.అలాగే ఈ పదవి కోసం పోటీ కూడా ఎక్కువగా ఉండడంతో ఈ విమర్శలు చేయడం ద్వారా తెలంగాణాలో కెసిఆర్ ను ధైర్యంగా ఎదుర్కోగలిగిన నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటూ పార్టీ హై కమాండ్ దృష్టిలో పడాలని రేవంత్ భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది.

Advertisement

అలాగే కాంగ్రెస్ సీనియర్లు కొంతమందిని తన దారికి తెచ్చుకుని వారి మద్దతు కూడా కూడగట్టుకుని అధిష్టానం ముందు బలమైన నాయకుడిగా చూపించుకునేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్ష పదవికి తాను తప్ప మరెవరు సెట్ అవరు అనే అభిప్రాయాన్ని కలిగించేందుకు రేవంత్ ప్లాన్ చేసినట్లు అర్థం అవుతోంది.

తాజా వార్తలు