‘‘మాకూ మంచి రోజులు వస్తాయి’’ అంటూ నిన్న టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ అసెంబ్లీలో మొన్నటిదాకా 15గా ఉన్న టీడీపీ బలం ‘టీఆర్ఎస్ ఆకర్ష్’ నేపథ్యంలో ఒక్కసారిగా మూడుకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు అప్పటిదాకా ముందు వరుసలో కూర్చున్న రేవంత్ రెడ్డి నాలుగో వరుసకు మారిపోయారు.
దీనిపై ఘాటుగా స్పందించిన ఆయన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చర్యలన్నీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆయన ఆరోపించారు.
‘‘మాకూ మంచి రోజులు వస్తాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
.






