అల్లరి సినిమాతో హీరోగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన నరేష్ “అల్లరి నరేష్” గా కామెడికి కేరాఫ్ అడ్రస్ గా మారి మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు.ఒకానొక సమయంలో ఏడాదికి అరడజనుకు పైగా సినిమాలు చేసిన నరేష్ గత కొంత కాలంగా ఏడాదికి రెండు మూడు మించి సినిమాలు చేయడంలేదు.
ఇటీవల వరస ప్లాప్ లతో ఉన్న నరేష్ ఈసారి మరో కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సెల్ఫీలు బాగా క్రేజ్ గా మారాయి.
ఈ సెల్ఫీల క్రేజ్ తో ఎందరో మృత్యువాత కూడా పడుతున్నారు కూడా.కాగా ఇప్పుడు ఏ సెల్ఫీ కాన్సెప్ట్ తో ‘సెల్ఫీ రాజా’ గా సినిమా చేయనున్నాడట.
టైటిల్ కు తగ్గ కధతో మంచి కామెడీని మిక్స్ చేసి సినిమాను తెరక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.గత కొంత కాలంగా సరైన హిట్ లేని నరేష్ కు ఈ సినిమా మళ్ళీ బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారట.
కాగా ఈ విషయం పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ సినిమా ప్రచారం లో భాగంగా ఎస్కేప్ అయిపోయాడు అనుకుంటున్న విజయ్ మాల్యా తో అల్లరి నరేష్ సేల్ఫీ దిగినట్టు ఒక ఫోటోని సృష్టించి ప్రచారం చేస్తున్నారు.” చూసారా పారిపోయాడు అనుకున్న విజయ్ మాల్యా నాతో ఫోటో దిగాడు ” అంటూ అల్లరి నరేష్ ఒక సేల్ఫీ పెట్టి సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాడు .







