తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది.ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు.
రేపు జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియాగాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.అనంతరం రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుతో పాటు పలు ఇతర అంశాలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.
కాగా రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే నిన్న అధిష్టానం పిలుపుతో హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వారిని కూడా ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు.