ఈ మధ్య మన టాలీవుడ్ బాగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే.అందుకే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పుడు పాన్ ఇండియన్ రేసులో ఉన్న బిగ్గెస్ట్ విజువల్ అండ్ గ్రాఫిక్స్ కలిగిన సినిమాల్లో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్‘ ( HanuMan) ఒకటి.ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా ( Teja Sajja )అమృత అయ్యర్ ( Amritha Aiyer ) హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”హను-మాన్”.ఇప్పటికే వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను బాగా అలరించడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.ప్రస్తుతం ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.
ఆడియెన్స్ కు ఒక విజువల్ వండర్ ను ఇవ్వాలని మేకర్స్ ఈ సినిమా గ్రాఫిక్స్ మరింత ఆసక్తికరంగా తీర్చి దిద్దుతున్నారు.టీజర్ తో భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ గురించి ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా రిలీజ్ కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.దీంతో ప్రతీ మంగళవారం ఒక అప్డేట్ ఇస్తామని ప్రశాంత్ వర్మ చెప్పారు.
చెప్పినట్టుగానే నిన్న ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో డిసెంబర్ 12న కన్ఫర్మ్ చేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది.మరి ట్రైలర్ తో అంచనాలు అందుకుంటే ఈ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయమే.2024 జనవరి 12న రిలీజ్ చేయనున్న ఈ మూవీ సంక్రాంతి పోటీలో స్టార్ హీరోలను ఎలా తట్టుకుంటుందో చూడాలి.