తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ మేరకు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఇందులో భాగంగా వివేక్ ను కాంగ్రెస్ లోకి రావాలంటూ రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలుస్తోంది.అయితే హస్తంగూటికి వచ్చేందుకు వివేక్ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వివేక్ సోదరుడు వినోద్ కు బెల్లంపల్లి టికెట్ ను ఇచ్చింది కాంగ్రెస్.అలాగే వివేక్ కుమారుడు వంశీకి చెన్నూరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని సమాచారం.
కాగా వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ బరిలో ఉన్నారన్న విషయం తెలిసిందే.అయితే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరిక అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.