యూట్యూబర్ దెబ్బకి మూతపడ్డ రెస్టారెంట్..! ఎందుకంటే..?!

ఈ కాలంలో కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లాలన్న, ఏమి చేయాలన్నా గూగుల్ లేదా వేరే వాటిలో ఆ స్థలానికి లేదా.

ఆ ప్రాంతానికి సంబంధించిన రివ్యూలను చెక్ చేసి అంతకు ముందు ఆ ప్రదేశాన్నికి వెళ్లి వచ్చిన వారు ఇచ్చిన రేటింగ్ బట్టి మిగతా వారు వెళ్లడం, వెళ్లక పోవడం లాంటి పనులు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది.

అందుకనే కాబోలు ప్రతి ఒక్క యాప్ వాటి రివ్యూలను ఇవ్వాల్సిందిగా వారి వినియోగదారులను కోరుతూ ఉంటాయి.అయితే తాజాగా ఓ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూ కి ఏకంగా ఓ హోటల్ మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెళితే.యూట్యూబర్ తన ఛానల్ ప్రమోషన్ కోసం ఓ రెస్టారెంట్ పై రివ్యూ ఇవ్వడంతో ఆ హోటల్ ఏకంగా ముతపడిపోయింది.

దీంతో ఆ యూట్యూబ్ లో పెద్ద ఎత్తున అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియా లోని హాయన్ ట్రీ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాడు.

Advertisement

ఈయన నడిపే ఛానల్ కు ఏకంగా ఏడు లక్షలకు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఆయన హాయాన్ అనే ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ దొరికే ఫుడ్ ఆర్డర్ చేశాడు.

ఆ ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాక తన ప్లేటులో వడ్డించిన ఆహార పదార్థాలతో అన్నం మెతుకులు కనబడగా.దాంతో అతడు ఆ రెస్టారెంట్ పై విమర్శలు చేశాడు.

ఇందులో భాగంగానే కస్టమర్లు తినగా మిగిలిన ఆహార పదార్థాలను వేరే వారికి వడ్డిస్తున్నట్లు భావించి ఆ రెస్టారెంట్ యజమాని కస్టమర్లని మోసం చేస్తున్నారు అంటూ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి ఆ హోటల్ పై తప్పుడు రివ్యూ ఇచ్చాడు.అతడు ఛానల్ ద్వారా ఇచ్చిన పోస్ట్ అతికొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి.

చివరికి ఆ వీడియో కాస్త ఫుడ్ సేఫ్టీ అధికారులు కంటపడింది.ఆ తరువాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ రెస్టారెంట్ పై దాడులు నిర్వహించి చివరికి ఆ రెస్టారెంట్ ను సీజ్ చేశారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఈ సమయంలో హోటల్ సిబ్బంది, హోటల్ యజమానులు తాము కేవలం నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే ఇస్తున్నామని ఎంత చెప్పిన అధికారులు వినకపోవడం నిజంగా విశేషం.అయితే ఈ సంగతి అంత ఇది వరకు జరిగినా.

Advertisement

ఆయన మరోసారి ఆ హోటల్ కి వెళ్లి తాను ఎంతో తప్పు చేశానని భావించి, పశ్చాత్తాపంతో ఆ హోటల్ యజమాని క్షమాపణ తెలుపుతూ మరో వీడియోను చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.

తాజా వార్తలు