మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ విప్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి, డబల్ బెడ్ రూం లలో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని వేములవాడలో కలిసి వినతి పత్రం సమర్పించారు.

ప్రతి నెల రేషన్ బియ్యం కోసం ఎల్లారెడ్డిపేట ఊరిలోకి వచ్చి బియ్యం తీసుకుపోవడానికి వందల రూపాయలు కిరాయి పెట్టుకొని వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ దీంతో కిష్టంపల్లి ,డబల్ బెడ్ రూం ల వారు వ్యయప్రయాసాలకు లోనవుతున్నారని,అదే విధంగా ఇక్కడ మినరల్ వాటర్ (శుద్ధ జల కేంద్రం) కూడా ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివరించారు.

వీలైతే రెండు చోట్ల రెండు కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని,అలా వీలుకాని పక్షంలో గ్రామంలో నాలుగు రేషన్ దుకాణాలు ఉన్నాయని వీరిలో ప్రతి మూడు నెలలకు ఒక డీలర్ ద్వారా ఒక్కో చోట ఇప్పించాలని కోరారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు.

వీలైనంత త్వరగా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన వారిలో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ సీనియర్ మండల నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్,శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్,వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ లు ఉన్నారు.

అధికారి వేధింపులు పంచాయతీ కార్యదర్శి ఆత్మ హత్య యత్నం
Advertisement

Latest Rajanna Sircilla News