హైడ్రామాకు తెర.. అమెరికా ప్రతినిధుల సభ కొత్త స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్ధీ ..!!

గత కొన్నిరోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది.అమెరికా ప్రతినిధుల సభ కొత్త స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్థీ ఎన్నికయ్యారు.

స్పీకర్ ఎన్నికు సంబంధించిన ఓటింగ్‌పై గత కొన్నిరోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు శనివారం 15వసారి నిర్వహించిన ఓటింగ్‌లో కెవిన్ విజయం సాధించారు.

అయితే డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రత్యర్ధి హకీం సెకూ జెఫ్రీస్ తన ఎన్నికకు కావాల్సిన మెజారిటీని సాధించలేకపోయారు.మొత్తం మీద 216 - 212 ఓట్ల తేడాతో కెవిన్ విజయం సాధించారు.

160 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి:

అమెరికా కాంగ్రెస్ 160 ఏళ్ల చరిత్రలో అత్యంత సుదీర్ఘకలం సాగిన స్పీకర్ ఎన్నికగా ఇది నిలిచింది.435 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లకు 222 సీట్లు, డెమొక్రాట్లకు 212 మంది సభ్యుల బలం వుంది.రిపబ్లికన్లకు వున్న ఆధిపత్యం రీత్యా స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు 57 ఏళ్ల కెవిన్ మెక్‌కార్దీకి తొలి రౌండ్‌లోనే సులభంగా మెజారిటీ రావాల్సి వుంది.

అయితే పార్టీలో చోటు చేసుకున్న విభేదాల నేపథ్యంలో తొలి నుంచే కెవిన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే 15 సార్లు ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది.స్పీకర్ ఎన్నిక కోసం 428 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

అనంతరం కెవిన్‌కు 216 ఓట్లు, హకీమ్ జెఫ్రీస్‌కు 212 ఓట్లు వచ్చాయని.దీంతో కెవిన్ స్పీకర్‌గా ఎన్నికైనట్లుగా క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రకటించారు.

నవంబర్ 8న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ సభలో మెజారిటీ కోల్పోయింది.ఈ క్రమంలో నాన్సీ పెలోసీ స్థానంలో మెక్‌కార్దీ యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.అమెరికాలోని ప్రోటోకాల్ ప్రకారం.

దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తర్వాతి హోదాలో స్పీకర్ నిలుస్తారు.హౌస్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీకర్ నియంత్రణలో వుంటుంది.

అందువల్లే అమెరికా రాజకీయాల్లో ప్రతినిధుల స్పీకర్‌కు తిరుగులేని ప్రాధాన్యత వుంటుంది.స్పీకర్‌గా ఎన్నికైన కెవిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు అభినందించారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు