టాలీవుడ్ యంగ్ హీరో, మెగా వారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా మూవీ రిపబ్లిక్.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాకు డైరెక్టర్ దేవా కట్ట దర్శకత్వం వహించాడు.ఇందులో జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు నటులు నటించారు.
ఈ సినిమాకు మణిశర్మ పాటలు అందించాడు.జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా ఈరోజు విడుదల కాగా.సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకు ఎటువంటి సక్సెస్ అందుకున్నాడో చూద్దాం.
కథ:
ఇందులో సాయి ధరమ్ తేజ్ పంజా అభిరామ్ అనే పాత్రలో కనిపిస్తాడు.పంజా అభిరాం మంచి తెలివైన విద్యార్థి.
తను ఈ సమాజం బాగు కోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు.ఇక తనకు మధ్యలో అవినీతి రాజకీయ నాయకురాలు పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ ఎదురవుతుంది.
ఇక ఈమె తను ఏదైనా దక్కించుకోవడానికి ఎలాంటి తప్పు నైనా చేస్తుంది.ఆమెకు అభిరామ్ ఎదురుపడగా ఆ తర్వాత ఏం జరగబోయేదే అసలు కథ.
నటినటుల నటన:
ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ తన నటనా పరంగా బాగా మెప్పించాడు.రమ్యకృష్ణ కూడా అవినీతి రాజకీయ నాయకురాలు పాత్రలో అద్భుతంగా నటించింది.
ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా తన పాత్రతో మెప్పించింది.రాహుల్ రామకృష్ణ, జగపతి బాబు తదితరులు తమ పాత్రలతో జీవించినట్లు అనిపించింది.

టెక్నికల్:
ఈ సినిమాలో డైరెక్టర్ దేవకట్టా బాగా సమాజం గురించి, రాజకీయం గురించి చూపించాడు.చాలా వరకు తన సినిమాలు ఇటువంటి జోనర్ లోనే తెరకెక్కాయి.ఇక ఈ సినిమాలో కూడా కథ అద్భుతంగా సాగింది.క్లైమాక్స్ మాత్రం బాగా తీశారు.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా ఒక సామాజిక రాజకీయ కథగా రూపొందింది.డైరెక్టర్ దేవకట్టా మంచి కథను ఎన్నుకున్నాడు.
ఈ కథకు సాయి ధరమ్ తేజ్ బాగా సెట్ అయ్యాడు.ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగా రూపొందించారు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ అద్భుతంగా రూపొందించారు.కాస్టింగ్ కూడా అందరికీ బాగా సెట్ అయింది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:
సినిమా బాగా సీరియస్ గా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కగా.మంచి కథతో అద్భుతంగా అనిపించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.ఇక ఈ సినిమా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.
రేటింగ్:
2.5/5